‘అదో చెత్త సినిమా’ 3+ గంటలు ఎలా చూశారు .. ‘యానిమల్’ మూవీపై నటి ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా ‘యానిమల్’.

Update: 2024-01-29 14:09 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా ‘యానిమల్’. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ.. గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళ్లు చేయడంతో పాటు.. భారీ ఎత్తున విమర్శలు కూడా అందుకుంటుంది. ఇందులో చాలా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని.. అమ్మాయిల మనోభావాలను దెబ్బతీసేలా సీన్స్ ఉన్నాయని, ఇదొక చెత్త సినిమా అంటూ నెట్టింట నెగిటివిటీ స్ర్పెడ్ అయింది. ఇక ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘యానిమల్’ చిత్రాన్ని.. నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ నటి కస్తూరి సైతం ఈ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె తన X వేదికగా స్పందిస్తూ.. ‘నిన్న రాత్రి ఈ సినిమా చూడటం మొదలుపెట్టాను.. సగం సినిమాకే నాకు చిరాకు వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని 3 + గంటలు ఆ సినిమా ఎలా చూశారు..?! ఆటో ఎగిరే విమానంలో ఆ సీన్లు ఏంటి? వామ్మో.. నన్ను తప్పుగా తీసుకోకండి.. సినిమాను టాప్ నాచ్‌లో తీశాడు.. కానీ ఆ స్థాయిని మనం అందుకోలేము.. అందులో చాలా ఉంది.. కానీ ఆ సినిమా నన్ను ఎంటర్‌టైన్ చేయలేదు.. విసుగు తెప్పించింది’ అంటూ చెప్పుకొచ్చింది. కస్తూరి ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతుంది.

Tags:    

Similar News