దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయతి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రవితేజ సరసన 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్న బ్యూటీ.. తన స్కిన్ టోన్‌పై వచ్చిన కామెంట్స్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. 'కెరీర్ మొదట్లో నా కలర్ గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంతో మందిని కలిశాను.
కొంతమంది నీ కలర్ హీరోయిన్ స్థాయికి సరిపోదని ఎగతాళి చేశారు. నటనకు, రంగుకు ఎందుకు సంబంధం పెడుతున్నారో అర్థం కాక ఎంతో ఆవేదనకు గురయ్యాను' అని తెలిపింది. ఈ క్రమంలోనే సినిమా ఫీల్డ్ వొదిలేద్దామనుకున్న టైమ్‌లోనే గద్దలకొండ గణేష్‌లో ఐటం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని చెప్పింది.
https://www.instagram.com/p/CZPbXD4hLKC/?utm_source=ig_web_copy_link