థియేటర్లలోకి సెన్సేషనల్ వెబ్ సీరిస్.. హింట్ ఇచ్చిన బిగ్‌బాస్ శివాజీ
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఇటీవల బిగ్‌బాస్‌లో అద్భుతంగా రాణించిన శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, ఇటీవల బిగ్‌బాస్‌లో అద్భుతంగా రాణించిన శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో దాదాపు 90కి పైగా చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు వెళ్లి తనదైన శైలిలో రాణించారు. కప్ గెలవకపోయినా పల్లవి ప్రశాంత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్‌కు ఒక పెద్దన్నలా శివాజీ ప్రోత్సాహం అందించారు.
తాజాగా.. 90s అనే వెబ్ సీరిస్‌తో శివాజీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివాజీ-నటి వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన '#90’s' మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ వెబ్ సిరీస్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్‌కు మొదటి నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా.. శివాజీ ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంత మంచి స్టోరీని సినిమాగా తీసి థియేటర్లలో ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్న ఎదురవడంతో శివాజీ స్పందించారు. ఇది బిగ్‌బాస్‌కు వెళ్లడానికంటే ముందే షూట్ చేశాం. దాదాపు పదేళ్ల తర్వాత తాను మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నన్ను థియేటర్లో చూసేందుకు ఎవరు వస్తారు అనుకున్నాను. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక ఇది విడుదల చేశాం కాబట్టి రెస్పాన్స్ మంచిగా రావడంతో పాటు రీచ్ కూడా ఎక్కువగా అవుతోంది. ఇప్పుడు దీనిని థియేటర్లో విడుదల చేస్తే స్టూడెంట్స్ కచ్చితంగా వస్తారు. ఈటీవీ వాళ్లకు అన్నీ తెలుసు. మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు. అంటూ శివాజీ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.