అల్లు అర్జున్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన స్నేహ రెడ్డి తండ్రి

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఆయన వైఫ్ స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టాడు.

Update: 2023-06-27 07:46 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఆయన వైఫ్ స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అల్లుడి గురించి గొప్పగా చెప్పారు. ‘మీరు మీ అల్లుడికి ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు.. ‘నా అల్లుడికి వందకు వంద మార్కులు వేస్తాను. దేశంలో ఎక్కడికెళ్లినా బన్నీ పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన అంత క్రేజ్ సంపాదించుకున్నారు’ అని చెప్పాడు. తర్వాత ‘మీరు ఎంత కట్నం ఇచ్చారు అంటూ’ అని ప్రశ్నించడంతో ‘బన్నికి ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు. వారి వద్ద చాలా సంపదన ఉంది. అలాంటప్పుడు కట్నం గురించి ఎందుకు అడుగుతారు. అల్లు అర్జున్ ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదు’ అని తెలిపారు. అయితే బన్నీ పెళ్లైన కొత్తలో కోట్లలో కట్నం తీసుకున్నరనే రూమర్స్ వినిపించాయి. 

Read More..

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!  

BRO Movie update : మామా, అల్లుడి హంగామా షురూ.. పిచ్చేక్కిస్తున్న BRO కొత్త పోస్టర్  

Tags:    

Similar News