విజయశాంతికి నాకు సంబంధమున్న మాట నిజమే.. కానీ..: సీనియర్ స్టార్ కమెడియన్

తాజాగా సీనియర్ కమెడియన్ చిట్టిబాబు.. అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Update: 2024-04-01 08:51 GMT

దిశ, సినిమా: తాజాగా సీనియర్ కమెడియన్ చిట్టిబాబు.. అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందం, అద్భుతమైన నటనతో ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పటికీ అన్ని రంగాల్లో రాణిస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ దక్కించుకుంది. ప్రస్తుతం 57 సంవత్సరాలున్న ఈ నటి.. ఒక నిర్మాతగా, ఒక నటిగా, రాజకీయ నాయకురాలిగా విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది.

30 ఏళ్ల సినీ కెరీర్ లో 180 సినిమాలకు పైగా నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి.. తన టాలెంట్ ను నిరూపించుకుంది. అయితే ఒకప్పుడు సీనియర్ స్టార్ కమెడియన్ రాజబాబుతో విజయశాంతి కాస్త క్లోజ్ గా ఉండేదట. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండగా.. అందరూ తప్పుగా అనుకున్నారట. ఏకంగా రాజబాబును ఈ హీరోయిన్ పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరైన చిట్టిబాబు స్పందించి.. ‘‘అవును విజయశాంతి-రాజబాబు మధ్య సంబంధం ఉంది. కానీ తండ్రీ కూతుళ్ల బంధం ఉంది. ఎవరు ఎన్నో రాసుకున్నారు. ఎన్నో అనుకున్నారు. అయినా నో ప్రాబ్లమ్. కానీ తను ఆడపిల్ల.. విజయశాంతి పై ఎలాంటి మచ్చ తీసుకురాకండి. తను నా బిడ్డ లాంటిది. అని మా అన్న బతికి ఉన్నప్పుడే చెప్పాడు.

అయినా ఆయన ఎప్పుడూ అమ్మాయిలకూ నష్టం కలిగించే పనులు చేయరు. విజయశాంతి విషయంలో ఆయన చాలా ఫీల్ అయ్యారు. మంచి మనసున్న వ్యక్తి. అలాగే మా సోదరుడు మరణించాక ఆయనకు ఆస్తులు ఏం లేవు. అద్దె ఇంట్లో ఉంటాడు. అంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ అవన్నీ అవాస్తవాలు. ఆయనకు చాలా ఆస్తులున్నాయి’’. అంటూ చిట్టిబాబు ఇంటర్వ్కూలో చెప్పుకొచ్చాడు.


Similar News