రీఎంట్రీకి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్ ..
90లలో స్టార్ హీరోల సరసన నటించి ఒక ఊపు ఊపిన హీరోయిన్లు అంతా ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు.
దిశ, సినిమా: 90లలో స్టార్ హీరోల సరసన నటించి ఒక ఊపు ఊపిన హీరోయిన్లు అంతా ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు. చాలా మంది ఫారిన్‌లోనే లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మారిన ఇండస్ట్రీని బట్టి ఇప్పుడిప్పుడే కొంత మంది హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఇంద్రజ, ఆమని, రాధ లాంటి స్టార్స్ రీఎంట్రీ ఇవ్వగా, తాజాగా హీరోయిన్ సంఘవి రీఎంట్రీకి రెడీ అవుతోంది. అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించిన సంఘవి.. సౌత్‌లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోల జడ్జిగా చేస్తుంది. కాగా తాజాగా మీడియాతో ‘మంచి అవకాశాలు వస్తే తప్పక సినిమాల్లో రీఎంట్రీ ఇస్తా’ అని చెప్పుకొచ్చింది.
Read More..