Janhvi Kapoor : త్వరలో మిమ్మల్ని కలుస్తాను

త్వరలోనే మిమ్మల్నందరినీ కలుస్తానంటూ దేవర హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగు సినీ ప్రేక్షకులకు తీపి కబురు చెప్పారు.

Update: 2024-09-23 06:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : త్వరలోనే మిమ్మల్నందరినీ కలుస్తానంటూ దేవర హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగు సినీ ప్రేక్షకులకు తీపి కబురు చెప్పారు. దేవర ఫ్రీ రిలిజ్ ఈవెంట్ రద్ధయిన నేపథ్యంలో జాన్వీ అభిమానుల కోసం ఓ వీడియో సందేశం పంపించారు. అందరికీ నమస్కారమని, దేవరతో తెలుగు సినిమా ఎంట్రీ ఇస్నున్న నన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో స్వాగతించారని, నాపై ఎంతో ప్రేమను చూసిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులు, నన్ను సొంత మనిషిగా భావిస్తున్న తెలుగు సినీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలన్నారు. మా అమ్మా మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసని..అమ్మకు కూడా తెలుగు ప్రేక్షకులంటే ఇష్టమని, అలాగే నాకు కూడా అని జాన్వీ చెప్పుకొచ్చారు. నన్ను ఇంతలా సపొర్టు చేస్తున్న మీ అందరు గర్వపడేలా ప్రతి రోజు కష్టపడుతానన్నారు.

దేవరలో నాకు కొరటాల శివ, ఎన్టీఆర్ లు అవకాశమివ్వడం నా అదృష్టమని, మా దేవర సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానన్నారు. నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుతామనుకున్నానని., కానీ ఈ సారికి అలా కుదరలేదని, త్వరలోనే మిమ్మల్నందరినీ కలుస్తాననుకుంటూ తన వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ అని జాన్వీ  వీడియోలో లంగావోణిలో తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు భాషలో వీడియో సందేశం వినిపించారు. సెప్టెంబర్‌ 27న థియేటర్లలో కలుద్దాం అంటూ ఇన్‌స్టాలో తెలుగులో క్యాప్షన్‌ పెట్టింది.

Full View

Tags:    

Similar News