Hero RaviTeja: రవితేజ మూవీ నుంచి సెకండ్ సింగిల్.. ‘రెప్పల్‌ డప్పుల్‌’ సాంగ్ లుక్ పోస్టర్

ఇక తాజాగా, మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ మిస్టర్ బచ్చన్.

Update: 2024-07-24 05:24 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీలో రవితేజ అమితాబ్ బచ్చన్ కి బిగ్ ఫ్యాన్ గా కనిపించనున్నారు. ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, పాటలు అందర్ని ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ నుంచి మూవీ మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు.

సితార్ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్ళడమే కాకుండా కొద్దీ రోజుల వరకు ట్రెండింగ్ లోనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలోని ‘రెప్పల్‌ డప్పుల్‌’ సాంగ్ ను 25 న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పాట లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిలో రవితేజ లుక్ చాలా స్టైల్ గా ఉంది చూడబోతుంటే ఇది కూడా యూత్ కి ఫేవరేట్ అయ్యేలా ఉంది. మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. భాగ్యశ్రీబోర్సే హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

రవితేజ హిట్ ట్రాక్ లో పడ్డాడు అని అనుకున్నప్పుడల్లా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది. ఇలాగే ప్రతీసారి జరుగుతుంది. సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియోట్ చేస్తుంది కానీ ఆశించని ఫలితం దక్కడం లేదు. ఇప్పుడు తీయబోయే మూవీ హిట్ అవుతుందో? లేదో చూడాలి.

Tags:    

Similar News