RGV: మియా మాల్కోవా మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా.. 

మియా మాల్కోవా మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా.. 

Update: 2024-10-01 04:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ మాత్రం తనకి నచ్చిందే ఫాలో అవుతాడు. అందరూ వెళ్లే రూటులో నేను వెళ్ళను .. నా రూటే సెపరేట్ అంటూ ఎవరితో కలవకుండా తన పని తాను చేసుకుపోతాడు. కానీ, ఆర్జీవీని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది టెక్నిషియన్స్ ఆర్జీవీ అభిమానులే వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు.

తీసిన మూడు సినిమాలే అయినా సందీప్ వంగ స్టార్ ఒక రేంజ్ కు వెళ్ళాడు. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ మూవీ సూపర్ హిట్ అయినా విషయం తెలిసింది. తాజాగా, ఐఫా వేడుకల్లో యానిమల్ మూవీ ఎన్నో అవార్డులను గెలుచుకుంది. యానిమల్ మూవీకి సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు సందీప్ వంగ అందుకున్నాడు.

స్టేజి మీద సందీప్ రెడ్డి "ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు చాలా థాంక్స్ .ఈ సందర్భంగా నేను మీకు ఒకటి చెప్పాలి. నేను ఎడిటింగ్ రామ్ గోపాల్ వర్మ సర్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను.థ్యాంక్యూ ఆర్జీవీ సార్ " అని తెలిపాడు. దీంతో ఆర్జీవీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. " సార్ సందీప్ రెడ్డి వంగ.. నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మియా మాల్కోవా మీద ఒట్టేసి చెప్తున్నాను" అంటూ ట్వీట్ చేసాడు. దీనికి సందీప్ రెడ్డి వంగ సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో స్వీట్ గా రిప్లై ఇచ్చారు.

Tags:    

Similar News