అందమైన క్షణాలంటూ.. మనోజ్ పెళ్లి వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మి
సినీ నటుడు మంచు మనోజ్, మౌనికా రెడ్డి కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి, వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే..
దిశ, సినిమా: సినీ నటుడు మంచు మనోజ్, మౌనికా రెడ్డి కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి, వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి నివాసంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తమ్ముడి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంది మంచు లక్ష్మి. కాగా సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మి దంపతులు కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తాజాగా, మనోజ్ పెళ్లి వీడియోను తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది లక్ష్మి. ఈ వీడియో వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వధూవరులిద్దరూ తాళి కట్టే సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. వీడియోలో మోహన్ బాబు సైతం ఎంతో ఆనందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.