వాళ్లను ఆదర్శంగా తీసుకుని ఐటెం సాంగ్స్ చేస్తున్న సయేషా?
సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, హీరోల తల్లిదండ్రులు కోడళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు.
దిశ, సినిమా: సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, హీరోల తల్లిదండ్రులు కోడళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. అందుకే పెళ్లయిన తర్వాత వెండితెరపై చాలా మంది కథానాయికలు కనిపించకుండా పోతారు. ఇక నయనతార ఫేమ్ ఉన్న హీరోయిన్ కాబట్టి పెళ్లైన కూడా మూవీస్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ గ్లామర్ షోలు మాత్రం చేయడం లేదు. ఇదిలావుంటే.. తమిళ స్టార్ హీరో ఆర్యను పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయిన స్టార్ కిడ్ సయేషా సైగల్ మాత్రం ఈ రూల్స్‌ను బ్రేక్ చేసింది. ఈ నటి ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ శింబు న్యూ మూవీ ‘పాత తాళ’లో ఓ ఈ ఐటెం సాంగ్‌లో మెరిసింది. అయితే బాలీవుడ్ నటిమనులను దృష్టిలో పెట్టుకొని సయేషా ఈ స్టెప్ తీసుకుని ఉండవొచ్చని టాక్. ఎందుకంటె బాలీవుడ్లో పెళ్లి తర్వాత కూడా హాలీవుడ్ తరహాలో బికినీలు ధరించి, లిప్‌లాక్‌లతో కొంతమంది హల్ చల్ చేస్తున్నారు.