రూ.150 డైరీ.. రూ. 2,500లకు అమ్ముతున్నావా? Sachin కూతురిపై ట్రోలింగ్
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ దారుణంగా విమర్శలపాలవుతోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే బేబీ ఇన్‌స్టాగ్రామ్‌లో
దిశ, సినిమా : సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ దారుణంగా విమర్శలపాలవుతోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే బేబీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగివున్న విషయం తెలిసిందే. కాగా ఇపుడు మరో కొత్త వెంచర్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త ప్రదేశాలను చూసేందుకు నిరంతరం ప్రయాణించడాన్ని ఇష్టపడే సారా.. తరచుగా తన దగ్గర పుస్తకాలు లేదా డైరీలతో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనకు జర్నలింగ్ అంటే చాలా ఇష్టమని చెబుతూ.. 2023 కోసం కొత్త డైరీల ప్లానర్లను ప్రారంభించిన విషయాన్ని నెట్టింట అభిమానులకు తెలియజేస్తూ ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. డైరీ ధర రూ.2,500 ఉంటుందని చెప్పడం విశేషం. దీంతో షాక్‌కు గురైన నెటిజన్లు 'సాధారణ స్టేషనరీలో రూ. 150కి దొరుకుతుంది. కావాలంటే వచ్చి కొనుక్కో' అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.