మీకు పెళ్లి కావాలంటే నాతో సినిమా చేయండి: సారా కామెంట్స్ వైరల్

పెళ్లి త్వరగా కావాలనుకునే ప్రతి నటుడు తనతో సినిమా చేయాలంటోంది సారా అలీఖాన్.

Update: 2023-05-16 06:34 GMT

 దిశ, సినిమా : పెళ్లి త్వరగా కావాలనుకునే ప్రతి నటుడు తనతో సినిమా చేయాలంటోంది సారా అలీఖాన్. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఆమె నటించిన చిత్రం ‘జరా హత్కే జరా బచ్కే’ జూన్ 2 విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె.. ‘నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్న నాల్గవ నటుడు విక్కీ. గతంలో రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్రాంత్ మాస్సీలకు ఇలాగే జరిగింది. అందుకే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నాతో సినిమా చేయాలి’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇక సినిమాను ఉద్దేశిస్తూ.. ‘ఇంతటి ప్రతిభావంతులైన టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం ప్రత్యేకంగా సంబంధాలు, వివాహాల గురించి ఉంటుంది. ప్రేక్షకులకు ఇలాంటి కథ చూపించబోతున్నందుకు సంతోషిస్తున్నా’ అని మురిసిపోయింది. 

Full View

Tags:    

Similar News