నిత్యా మీనన్ అబద్దాలు చెప్తోంది.. పెళ్లి గురించి నేను వేధించలేదు : సంతోష్
దిశ, సినిమా : పెళ్లి చేసుకుంటానని తనను ఆరేళ్లుగా వేధించాడన్న హీరోయిన్ నిత్యా మీనన్ ఆరోపణలపై స్పందించాడు తమిళ్ ఫిల్మ్ క్రిటిక్ సంతోష్ వార్కే..Latest Telugu News
దిశ, సినిమా : పెళ్లి చేసుకుంటానని తనను ఆరేళ్లుగా వేధించాడన్న హీరోయిన్ నిత్యా మీనన్ ఆరోపణలపై స్పందించాడు తమిళ్ ఫిల్మ్ క్రిటిక్ సంతోష్ వార్కే. తాను దాదాపు 30 ఫోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి విసిగించేవాడినన్న నిత్య ఎలిగేషన్స్‌లో నిజం లేదన్నాడు. ఒక వ్యక్తి పేరున ఎన్ని సిమ్ కార్డ్స్ మంజూరవుతాయో ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. అంతేకాదు నిత్యకు వేరొకరితో నిశ్చితార్థమైందని ఆమె తల్లి చెప్తే, అసలు ఎంగేజ్మెంట్ కూడా జరగలేదని తండ్రి చెప్పాడని.. ఈ విషయంలో ఏం తేల్చుకోవాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉండిపోయానని చెప్పాడు.
ఇక తండ్రి చనిపోయాక అసలు ఈ విషయాల్లో జోక్యం చేసుకోవడమే మరిచిపోయానని.. అప్పటి నుంచి ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నానని, అలాంటప్పుడు తమ ఇద్దరికీ పెళ్లి కాబోతుందనే ప్రచారం ఎందుకు చేస్తానని వివరించాడు.