sandeepreddy vanga : సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరు కూడా ఓ సినిమా పేరే.. అలా ఎందుకు పెట్టారంటే..
సందీప్ రెడ్డి వంగ సరికొత్త ఐడియాలతో, ట్విస్టులతో ఆకట్టుకుంటూ న్యూ జనరేషన్ హార్ట్ ఫేవరెట్‌గా మారిపోయాడు.
దిశ, సినిమా : తన సినిమాల్లో లవ్, ఎమోషనల్, యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్‌కు ప్రయారిటీ ఇచ్చే డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. సరికొత్త ఐడియాలతో, ట్విస్టులతో ఆకట్టుకుంటూ న్యూ జనరేషన్ హార్ట్ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి మూవీ హిట్ తర్వాత అతను మరింత పాపులర్ అయ్యాడు. పైగా ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తీసిన యానిమల్ మూవీ కూడా ఎంత యూత్ ఫేవరెట్ అయిపోయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా సినీ మేకింగ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తీయబోతుండగా.. సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన ఓ విషయంపై అభిమానులు డిస్కస్ చేస్తున్నారు. ఏంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగకు ‘మీ కొడుకు పేరు, మీరు తీసిన ఓ సినిమా పేరు ఒకటే కదా.. అలా ఎందుకు పెట్టారు’ అనే ప్రశ్న ఎదురైందట. ఈ సందర్భాగా అతను సమాధానమిస్తూ.. ‘వాస్తవానికి నేను అర్జున్ రెడ్డి మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అతడు పుట్టాడు. అందుకే వాడికి అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాం. పైగా ఈ పేరంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ పెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ.