గులాబి రంగు చీరలో హొయలు ఒలుకుతున్న సంయుక్త మీనన్.. అందమే అసూయ పడేలా ఉన్నావ్ అంటూ కామెంట్స్
‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసార’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసార’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ‘సార్’, ‘విరూపాక్ష’, ‘డెవిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. విరూపాక్ష సినిమాలో తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలో సంయుక్తకు విపరీతమైన పాపులారిటీ రావడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గకుండా నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. ట్రెండీ వేర్‌లోనే కాకుండా ట్రెడిషనల్ లుక్‌లో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో రోజ్ పింక్ కలర్ శారీ కట్టుకొని హొయలు ఒలుకుతూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు అందమే అసూయ పడేలా ఉన్నావ్ అని.. ఈ భూమి మీద ఉన్న వారిలో అందగత్తె ఎవరు అని సెర్చ్ చేస్తే నీ పేరే వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.