ఒక్క ఓటుతో కింగ్ అయిపోయిన సంపూర్ణేష్ బాబు

‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేశ్ బాబు

Update: 2023-10-02 09:58 GMT

దిశ, సినిమా: ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం ‘మార్టిన్ లూథర్ కింగ్’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. ఫుల్ లెంత్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ఓ గ్రామంలో ఉత్తరం - దక్షిణం అంటూ రెండు వర్గాల ప్రజల మధ్య జరిగే ఆధిపత్య పోరు ఫన్నీ ఫన్నీగా చూపించారు. ఇందులో ప్రెసిడెంట్ ఎలక్షన్‌‌లో నరేష్​ - వెంకటేష్ మహా ప్రత్యర్థులుగా పోటీకి దిగడం.. ఆ తర్వాత ఎన్నికలు రసవత్తరంగా సాగడాన్ని కామెడీ ఎలిమెంట్స్‌తో చూపించారు. అయితే ఒక్క ఓటు గెలుపును నిర్ణయిస్తుండగా.. ఆ ఓటు సంపూర్ణేష్ బాబుది అయి ఉండటం, అప్పటి వరకు గ్రామ ప్రజలకు ఆయన పేరు కూడా తెలియకపోవడం.. ఈ ఓటుతో కింగ్ అని పిలిపించుకోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్.

Tags:    

Similar News