Samantha: ఆహారం లేకుండా ఉండగలను కానీ శృంగారం లేకుండా నో ఛాన్స్ అంటూ సమంత షాకింగ్ కామెంట్స్.. (వీడియో)
ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని 4 ఇయర్స్ కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుని దూరంగా ఉంటూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఆ మధ్య ఈ బ్యూటీ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ తన హెల్త్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ యోగా వీడియోలు, తన హాట్ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె ఒక చిన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
గతంలో బాలీవుడ్లో ఏదో ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. అక్కడ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమెను ఆహారం, శృంగారం ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరు అనే ప్రశ్న అడగగా. దానికి కాసేపు ఆలోచించిన సమంతా " ఆహారం లేకుండా ఉండగలను.. కానీ శృంగారం లేకుండా ఉండలేను” అని ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మొదట్లో షాక్ అయినా.. తర్వాత ఆమె డేర్‌నెస్‌కి ప్రశంసిస్తున్నారు.
(video link credits to vlogking instagram id)