ఆ గాయం కంటే ఇది చాలా పెద్దది.. బోల్డ్ ఫొటో షూట్‌పై సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనతి కాలంలోనే తన యాక్టింగతో, అందంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడిన ఈ అమ్మడు.. సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉండేది.
ఇటీవల తను కంమ్ బ్యాక్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే హెల్త్ విషయాలకు సంబంధించిన పలు టిప్స్ చెబుతూ పోస్టులు పెడుతోంది. అంతే కాకుండా.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది ఈ అమ్మడు. ఈ మేరకు నెట్టింట హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా, సమంత ఫెమినా కవర్ పేజీ కోసం బోల్డ్ ఫొటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించింది ఈ బ్యూటీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. ‘మన మీద మనకున్న నమ్మకం చాలా గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది. ఇన నా 13 ఏళ్ల సినిమా కెరియర్లో చాలా అభద్రతాభావానికి గురవుతున్నానని తెలుసుకోగలిగి తొందరగానే దాని నుంచి బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.