నాజీవితం ఓ తెరచిన పుస్తకం.. చైతూనుద్దేశించి సమంత షాకింగ్ కామెంట్స్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని, తర్వాత విడిపోయారు.
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని, తర్వాత విడిపోయారు.
అయితే చైనుంచి విడిపోయిన తర్వాత నుంచి సామ్ కు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే,ప్రస్తుతం సమంత నటించిన చిత్రం శాకుంతలం త్వరలో విడుదల కాబోతుంది.దీంతో ఈ అమ్మడు వరస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది.
అయితే ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌కు ఆరోగ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ లేదా, విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటున్నాయి. అయితే సామ్ కొన్ని సార్లు వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, మరికొన్ని సార్లు తనకు తెలియకుండానే నోరు జారి వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా జీవితంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, నా జీవితం ఓ తెరచిన పుస్తకం అంటూ వ్యాఖ్యానించింది. ఎత్తుపల్లాలను పారదర్శకంగా అందరూ చూపించవచ్చు.కానీ కొందరి లో ఫేక్ గా ఉండటం..విషయాలను దాచిపెట్టడం నచ్చవు నేను అలా ఉండలేను అంటూ సమంత వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందంటు కొందరు ముచ్చటిస్తున్నారు.
Also Read: 'శాకుంతలం' సినిమా నాకొక పెద్ద బాధ్యత: సామ్