మళ్లీ దెబ్బతిన్న సమంత ఆరోగ్యం!
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. కాగా వరుస ప్రమోషన్స్‌తో దూసుకుపోతున్నారు మూవీ టీం. ఇక సమంత తన ఆరోగ్యం గురించి కూడా లెక్క చేయకుండా వరుస షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. సడన్‌గా సామ్ ప్రమోషన్స్‌లో కనిపించకుండా పోయింది. దీంతో సామ్ ఎందుకు సైలెంట్ అయింది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. తాజాగా సమంత క్లారిటీ ఇచ్చింది. ‘ప్రస్తుతం నాకు ఆరోగ్యం బాగాలేదు. జ్వరం గొంతు కూడా సరిగ్గా లేకపోవడంతో వీటన్నింటికి బ్రేక్ ఇచ్చి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది’ అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: ‘శాకుంతలం’ హీరో సమంత కంటే 5 ఏళ్లు చిన్నోడా!