Samantha Health: కూతురి ఆరోగ్యంపై స్పందించిన సమంత తండ్రి..
కూతురి ఆరోగ్యంపై స్పందించిన సమంత తండ్రి.. Samantha's father reacts on her health condition
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో నిన్నటి నుండి చర్చించుకుంటున్న వార్త ఏదైనా ఉందా అంటే.. అది సమంత అనారోగ్యం విషయమే. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ అందరినీ కలచివేసింది. "మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ సిస్టం కి సంబంధించిన వ్యాధితో నేను పోరాడుతున్నాను. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. నేను త్వరగా కోలుకుంటానని డాక్టర్లు చెబుతున్నారు. కాకపోతే కొంత సమయం పట్టేలా ఉంది. కానీ ఇది నయమవుతుంది" అని ఆమె రాసిన సారాంశం అభిమానుల హృదయాలను బరువెక్కించింది.
సమంత చేసిన ఈ పోస్ట్ అన్ని మాధ్యమాలలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమె శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ సామ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమాని ఒకరు సమంత తండ్రిని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నించారు. "మీ కూతురి ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె ఏ విధమైన మయోసిటిస్ లక్షణాలతో బాధపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబిచ్చిన సమంత తండ్రి.. "ఆమె క్షేమంగా ఉంది. ఈ మెడికల్ టెర్మినాలజీ గురించి నాకు అంతగా తెలియదు. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్" అంటూ రిప్లై ఇచ్చారు.
మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న రకుల్.. పిచ్చెక్కిస్తున్న బోల్డ్ లుక్స్
సామ్‌కు ఆ వ్యాధి సోకడానికి చైతూనే కారణం.. సమంత తల్లి సంచలన కామెంట్స్