మనల్ని ప్రేమించే వాళ్లతో ఎక్కువగా ఉండాలంటూ.. సమంత ఏమోషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసిటీస్ వ్యాధి భారిన పడి కోలుకున్న విషయం తెలసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, ప్రతీ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Update: 2023-06-16 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసిటీస్ వ్యాధి భారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, ప్రతీ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

కాగా, తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ ఏమోషనల్ పోస్టు చేసింది. అది ఏమిటంటే? అతి కష్టం మీద ప్రస్తుతం సాధారణ స్థితికి రాగలిగాను, దీని కోసం ఎంతో పోరాటం చేశాను. ఉప్పు, చక్కెర, ఆహార ధాన్యాలు పూర్తిగా మానేశాను, మందులే నాకు ఆహారమయ్యాయి.

అంతేకాదు ఈ క్రమంలో కెరీర్‌లో వైఫల్యాలపై కూడా సమీక్షించుకున్నానని తెలిపింది. ఆమె ఇంక తన పోస్ట్‌లో రాస్తూ.. జీవితంలో కొన్నిసార్లు ప్రతిది మనం అనుకున్నట్టు జరగదని తెలుసుకున్నాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఒక్క అడుగు ముందుకేసిన అది గెలుపే అంటూ ఏమోషనల్ పోస్ట్ చేశారు. మనం ప్రేమించాలి, మనల్నీ ప్రేమించే వాళ్లతో ఎక్కువగా ఉండాలంటూ, దేవుడు కొంత ఆలస్యం చేసిన, చేయాల్సింది చేస్తాడని, అండగా ఉంటాడని పేర్కోంది సమంత. ఇక ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సామ్ మయోసైటీస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఉంది. అందుకే ఈ పోస్టు చేసి ఉంటదని తమ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అలియాతో పెళ్లి మా అమ్మకు నచ్చలేదు.. ఫొటో చూసి పెదవి విరిచింది

Tags:    

Similar News