ఇండస్ట్రీలో దుమారం రేపుతోన్న వార్త.. నాగచైతన్య గురించి వారితో చర్చించిన సమంత!!

గత ఏడాది నుంచి హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే.

Update: 2024-01-18 08:52 GMT

దిశ, సినిమా: గత ఏడాది నుంచి హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ తీసుకుంటోంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సమంత ఫ్యాన్స్‌తో తరచూ టచ్‌లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటని అడగ్గా.. దీనికి సామ్ బదులిస్తూ.. ‘జీవితంలో నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే.. నా సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో నేను విఫలయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడు ప్రభావితమయ్యాను.

నేను కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైంది. నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇంకా ఉందని. నేను గుర్తించిన ఈ విషయం నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైనదని తెలుసుకున్నాను” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ స్క్రీన్ షార్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. మాజీ భర్త నాగచైతన్యను ఉద్దేశించే ఈ విధంగా మాట్లాడిందంటూ జనాలు చర్చించుకుంటున్నారు. పలువురు అక్కినేని ఫ్యాన్స్.. ఇంకా చైతన్యను మర్చిపోలేక సమంత అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది వెటకారపు కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది వీరిద్దరు మళ్లీ కలిస్తే బాగుండని భావిస్తున్నారు. 




Similar News