Samantha: ఏంటి సమంత పెళ్లి చేసుకోబోయే డైరెక్టర్ తెలుగువారా? సామ్ మళ్ళీ తెలుగింటి కోడలు కానున్నదా!

‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-08-15 05:20 GMT

దిశ, సినిమా: ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని దూరంగా ఉంటుంది. ఇక డివోర్స్ తర్వాత ఈ అమ్మడు మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే రీసెంట్‌గా ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఇదిలా ఉంటే రీసెంట్‌గా తన మాజీ భర్త నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన తర్వాతే అక్కినేని హీరో నాగ చైతన్యకు సామ్ డివోర్స్ ఇచ్చిందని జనాలు చర్చించుకుంటున్నారు.

అయితే దర్శకుడు రాజ్‌కు ఇంతకు ముందే పెళ్లైంది. కానీ, సామ్‌తో లవ్‌లో ఉన్నందున వైఫ్‌కు డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రాజ్ నిడిమోరు తెలుగు వారు కావడం విశేషం. అతను ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారట. దీంతో మరోసారి సమంత తెలుగింటి కోడలు అవుతున్నదని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. కాగా సమంత- రాజ్ తన ఎఫైర్‌ని ఎప్పుడైనా బయట పెట్టవచ్చని ఇన్‌సైడ్ వర్గాల టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.




Tags:    

Similar News