సమంత, చై మళ్లీ కలిసిపోతున్నారా..? లవ్ సింబల్ షేర్ చేసిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే, మజిలీ, మనం, ఆటో నగర్ సూర్య వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే, మజిలీ, మనం, ఆటో నగర్ సూర్య వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2019, ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ మంచి విజయం సాధించి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచింది. ఈ క్రమంలో సామ్, చైతు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు కొన్ని రోజులకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఇద్దరూ విడిపోయి సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. అయితే ఏప్రిల్ 5 నాటికి ‘మజిలీ’ మూవీ విడుదలై నాలుగేళ్లు పూర్తి కావడంతో డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా టీంకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. తాజాగా, సమంత శివ నిర్వాణ పోస్టును తన ట్విట్టర్లో రీట్వీట్ చేసింది. అంతేకాకుండా ‘ఫోర్ ఇయర్స్ ఆఫ్ మజిలీ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు హీర్ట్ సింబల్‌ను జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ‘చై, సామ్‌తో మరో సినిమాను తెరకెక్కించండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్న.. సామ్ ఎమోషనల్
#4YearsofMajili ♥️ https://t.co/uWcftyByex
— Samantha (@Samanthaprabhu2) April 5, 2023