Samantha : రూ.25 కోట్ల అప్పుపై స్పందించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏడాదిపాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతోపాటు వైద్యం కోసం ఓ ప్రముఖ హీరో దగ్గర రూ.25 కోట్లు అప్పు తీసుకుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో తాజాగా స్పందించిన నటి.. ‘మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లు అయిందని ఎవరో మీకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో అతి చిన్న భాగాన్ని మాత్రమే నాకు ఖర్చు అయినందుకు సంతోషిస్తున్నా. నా కెరీర్లో నేను చేసిన పనులన్నింటికీ నాకు సరిపడ జీతం ఇవ్వబడిందని అనుకోను. కాబట్టి నన్ను నేను సులభంగా చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్తో వేలాదిమంది బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించి మేము వెల్లడించిన సమాచారంతో దయచేసి బాధ్యత వహించండి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.