అతడిని పెళ్లి చేసుకుని యాగం చేస్తున్న సమంత (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకుని వరుస చిత్రాల్లో నటిస్తోంది.

Update: 2023-07-06 03:58 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకుని వరుస చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ మూవీపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ చిత్రం చివరి షెడ్యూల్ ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో మొదలైంది. అయితే ఇందులో భాగంగా విజయ్, సమంతలపై క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో అందరూ యాగం చేస్తునట్లు కనిపించారు. ఓ వైపు సమంత, విజయ్ పెళ్లికి ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. అయితే ఈ సినిమాలో సామ్, విజయ్ కొన్ని సన్నివేశాల్లో భార్యభర్తలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read: బిగ్ షాక్ : ఒకే గూటికి చేరిన సమంత, నాగచైతన్య

Tags:    

Similar News