సమంతకు పూల అలర్జీ.. షూట్లో మొత్తం ర్యాషెస్ !
సమంత తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాకుంతలం మూవీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: సమంత తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాకుంతలం మూవీ చేసింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సామ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా సమంత శాకుంతలం కథ గురించి వివరిస్తూ.. ఇది ఐదవ శతాబ్దంలో రాసిన కథ. ఇప్పటి మోడ్రన్ అమ్మాయి అయిన నేను ఆ క్యారె క్టర్‌తో రిలేట్ అవుతున్నాను. శకుంతల పాత్ర ఇప్పటి అమ్మా యిలకు కనెక్ట్ అవుతుంది.
ఈ రోల్ చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత. దాంతో ముందు నేను భయపడ్డాను. అందుకనే గుణ శేఖర్ అడగ్గానే నో చెప్పాను. నేను అప్పుడే రాజీ పాత్ర చేసి వచ్చాను. ఇప్పుడు చేసే శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతీ ఫ్రేమ్‌లో అందంతో పాటు పాత్రలో ఓ డిగ్నిటీ, గ్రేస్ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అందుకు కారణం నా దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ చిత్రానికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టారు. తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో సామ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సమంతకు పూల ఎలర్జీ ఉందట. ఈ మూవీలో ఆమె ధరించిన పూల వల్ల చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయని, అదొక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని చెప్పింది. 6నెలల పాటు అది అలాగే ఉండిపోయిందని, షూటింగ్‌లో కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు తెలిపారు. అలాగే మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగు, తమిళం, హిందీల్లో తాను డబ్బింగ్ చెప్పానని, ఇలా వేర్వేరు భాషల్లో చెప్పడం చాలా కష్టమైన పని అని అన్నారు.