రాజకీయాల్లోకి సమంత..! ఆ పార్టీ తరఫున ప్రచారం..? స్కెచ్ మాములుగా లేదుగా
సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతుంది. సమంతకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. స్టార్ హీరోలతో పోటీగా సమంత ఫాలోవర్స్ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాపులారిటీని క్యాచ్ చేసుకునేలా ఓ రాజకీయ పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమెను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. పార్టీ అధినేత సూచన మేరకు ఇప్పటికే సమంతతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
సమంత గతంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానంగా పలు కార్యక్రమాలు చేయడంతో పాటే.. రైతులకు సపోర్ట్ చేయడం, చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం లాంటి కార్యక్రమాలు చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సమంతకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీన్ని క్యాచ్ చేసుకుని తమ పార్టీ ప్రచారంలో కీలకంగా తీసుకోవాలని చేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీ నేతలు.
ఈ క్రమంలోనే తమ పార్టీకి మద్దతుగా నిలబడి.. పార్టీ ప్రచారాల్లో పాల్గొనాలని కోరారట. అయితే.. సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌ను బీఆర్ఎస్ పార్టీ వాళ్లు వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నరని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ సమంత కానీ స్పందించాల్సి ఉంది.