నిర్మాతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.. మౌనంగా ఉండలేనంటూ
స్టార్ నటి సమంత ఓ ఇంటర్వూలో కన్నీళ్లు పెట్టుకుంది. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నా.. ‘శాకుంతలం’ డబ్బింగ్ చెప్పడం ఆపలేదంటూ ఎమోషనల్ అయింది.
దిశ, సినిమా: స్టార్ నటి సమంత ఓ ఇంటర్వూలో కన్నీళ్లు పెట్టుకుంది. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నా.. ‘శాకుంతలం’ డబ్బింగ్ చెప్పడం ఆపలేదంటూ ఎమోషనల్ అయింది. అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు ‘సమంతది అంత డ్రామా. ఆమె తన సినిమాలను ప్రమోట్ చేయడానికి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తుంది. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కావు’ అంటూ విమర్శించాడు.
అయితే ఇక్కడ చిట్టిబాబు చెవులకు మొత్తం వెంట్రుకలుంటాయి అనే విషయం మనకు తెలుసు. ఇది దృష్టిలో పెట్టుకున్న సమంత తన ఫోన్లో ‘మనుషుల చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుంది’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నా అంటూ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అలాగే ‘ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడితే మౌనంగా ఉండను’ అని సమంతకు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read more: