అజరామరం.. పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’
అనిర్వచనీయమైన ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందిన అజరామరమైన పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.
దిశ, సినిమా : అనిర్వచనీయమైన ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందిన అజరామరమైన పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అద్భుతమైన సంభాషణలు, అంతకు మించి కళ్లు ఆనందంతో విప్పారే సన్నివేశాలు, శకుంతలంగా సమంత అందం చూస్తుంటే మూవీ బిగ్ హిట్ అవుతుందని అర్థమవుతుంది. అంతేకాదు దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ లుక్ కట్టిపడేస్తుండగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ ప్రయాణం ఎంత హృద్యంగా ఉంటుందనేది ట్రైలర్‌లో చక్కగా చూపించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి.