సెక్స్ కోసమే ఎనిమిదేళ్లు వాడుకుని వదిలేశాడు: సల్మాన్‌పై నటి ఆరోపణ

స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై తన మాజీ ప్రేయసి సోమీ అలీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు అతనితో గడిపిన ఎనిమిదేళ్లను తన జీవితంలో అత్యంత చెత్త సమయంగా పేర్కొంది.

Update: 2023-01-08 10:46 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై తన మాజీ ప్రేయసి సోమీ అలీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు అతనితో గడిపిన ఎనిమిదేళ్లను తన జీవితంలో అత్యంత చెత్త సమయంగా పేర్కొంది. అలాగే తనను నిరంతరం స్టుపిడ్ అని పిలవడంతోపాటు పబ్లిక్‌గానే తన స్నేహితుల ముందు తన గురించి తక్కువ చేసి మాట్లాడేవాడని, విలువలేని స్త్రీగా భావిస్తూ దారుణంగా అవమానించినట్లు గుర్తుచేసింది. ఈ మేరకు ఇన్‌స్టా‌వేదికగా ఓ నోట్ షేర్ చేస్తూ ఆవేదనచెందిన సోమీ.. 'అతను నా పట్ల వ్యవహరించిన తీరునుబట్టే నా పద్ధతులు మార్చుకున్నా. సల్మాన్ మంచివాడుకాదని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దురదృష్టవశాత్తు ఇలాంటి వ్యక్తి నన్ను వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నా. పేరుగాంచిన మగాళ్లు కూడా ఆడవాళ్లను మోసం చేయగలరని, ధైర్యంగా కొట్టగలరని ఆలస్యంగా తెలుసుకున్నా. లైంగిక, శారీరక వేధింపుల పరంగానే కాదు తన ప్రవర్తన గురించి ఎక్కడ మాట్లాడకుండా నన్ను మౌనంగా ఉంచేందుకు బెదిరించడం కూడా గుండాయిజంగానే భావిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. 

స్కిన్ షో చేయాలనుకుంటే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లండి: నటిపై ట్రోలింగ్


Tags:    

Similar News