Salman Khan :హాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేస్తున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయాలను చవిచూస్తున్నాడు
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయాలను చవిచూస్తున్నాడు. తాజాగా హాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యాడు సల్మాన్. హాలీవుడ్‌లో ‘మార్వెల్’ పాపులర్ మూవీ సిరీస్‌లలో ఒకటైన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ మూడో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీని సల్మాన్ ఖాన్ భారతదేశంలో ప్రమోట్ చేస్తున్నాడు. దీని గురించి ఒక వీడియోను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ యాడ్‌లో కూడా సల్మాన్ నటించాడు.