ఊహకందని రేంజ్‌లో ‘Salaar’ బిజినెస్.. నైజాంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?
ప్రజంట్ ప్రభాస్ అభిమానులంతా ‘సలార్’ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు
దిశ, సినిమా: ప్రజంట్ ప్రభాస్ అభిమానులంతా ‘సలార్’ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే యూఎస్‌లో బుకింగ్స్ స్టార్ట్ అవగా హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి.
తాజాగా ఈ మూవీ నైజాం హక్కులకు సంబంధించి హాట్ టాపిక్‌గా మారింది. దిల్‌రాజు ఈ సినిమా హక్కులను దక్కించుకొగా ఒక్క నైజాం ఏరియాకే దాదాపు రూ.80 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అందులో రూ.65 కోట్లు నాన్ రిఫండెబుల్. రూ.15 కోట్ల రిఫండెబుల్ పద్దతిలో డీల్ కుదిరించుకున్నారట. అంటే ఈ సినిమా నైజాంలో రూ.80 కోట్లు కలెక్ట్ చేయకపోతే హోంబలే సంస్థ రిటర్న్ రూపంలో దిల్‌రాజుకు రూ.15 కోట్లు చెల్లించేలా డీల్ కుదిరినట్లు టాక్. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. కానీ నైజాంలో ఈ రేటు పలికిందంటే మామూలు విషయం కాదంటున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి :
మొదలైన ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్.. హాట్ కేకుల్లా కొంటున్న ఫ్యాన్స్