అభిమానులను మైమరపిస్తున్న 'Shaakuntalam' Trailer!

సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'శాకుంతలం'.

Update: 2023-01-09 10:58 GMT

దిశ, సినిమా: సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'శాకుంతలం'. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. భారీ విజువల్స్‌తో కూడిన ట్రైలర్‌లో సమంత అద్భుతంగా నటించింది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సామ్ అందం, అభినయం, డైలాగ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే ఈ చిత్రం ట్రైలర్‌లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హను చూపించడం విశేషం. కాగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన చిత్రంలో దేవ మోహన్, మోహన్ బాబు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2023 ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకాబోతుంది.


Similar News