'శాకుంతలం' రన్ టైమ్ లాక్
గుణ టీమ్ వర్క్స్ పతాకంపై, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా, గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం' సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
దిశ, వెబ్ డెస్క్: గుణ టీమ్ వర్క్స్ పతాకంపై, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా, గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం' సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.మలయాళ నటుడు దేవ్ మోహన్ శాకుంతలం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో శాకుంతలం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.
తాజాగా ఇప్పుడు ఈ పాన్-ఇండియన్ చిత్రం 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, అదితి బాలన్, అనన్య నాగళ్ల, గౌతమి కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. చాలా రోజుల తరువాత మెలోడీ కింగ్ మణిశర్మ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.
Read more: