ఆ నీచమైన కామెంట్స్ మానసికంగా దెబ్బతీశాయి: Saiyami Kher

యంగ్ యాక్ట్రెస్ సయామీ ఖేర్ కెరీర్ ప్రారంభంలో పరిశ్రమలోని వ్యక్తులచే బాడీ షేమ్‌కి గురైనట్లు తెలిపింది.

Update: 2022-12-08 12:57 GMT

దిశ, సినిమా: యంగ్ యాక్ట్రెస్ సయామీ ఖేర్ కెరీర్ ప్రారంభంలో పరిశ్రమలోని వ్యక్తులచే బాడీ షేమ్‌కి గురైనట్లు తెలిపింది. సాధారణంగా ప్రజలు తన శరీరంపై కామెంట్స్‌తో అవమానించినా పెద్దగా బాధపడలేదన్న ఆమె.. సహనటుల నీచమైన కామెంట్స్ మాత్రం మానసికంగా ఒత్తిడికి గురిచేశాయని పేర్కొంది.

మందపాటి చర్మం కలిగి ఉన్నందున దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నానని... లిప్ సర్జరీ, నోస్ సర్జరీ చేయించుకోమని ఉచిత సలహాలిచ్చారని గుర్తుచేసుకుంది. 'నాకు రకరకాల విషయాలు చెప్పారు. ఎవరి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. శరీరాన్ని అవమానించడం, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరం. మహిళల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సున్నితంగా ఉండాలని ప్రజలకు సూచించాను. లేదంటే ఊహించని పరిణామాలు, ప్రతికూలతలు ఎదురవుతాయి' అని పలు విషయాలను ప్రస్తావించింది.

కాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ఫాదు: ఎ లవ్ స్టోరీ' డిసెంబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది సయామీ.

ఇవి కూడా చదవండి:

ముఖం దాచుకుని ఒళ్లంతా చూపించిన నటి (వీడియో)

Tags:    

Similar News