'వెయ్ దరువెయ్' బిగ్ హిట్ అవుతుంది: సాయి ధరమ్ తేజ్
‘వెయ్ దరువెయ్’ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.
దిశ, సినిమా: 'వెయ్ దరువెయ్' సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మూవీ చూడాలనే కుతూహలాన్ని రేపుతుందని, ఖచ్చితంగా ఈ మూవీ తెలుగులో సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాన్న ఆయన.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజు పొత్తూరు నిర్మించిన సినిమా టీజర్‌ను సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్.
అలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకనిర్మాతలు 'సాయి ధరమ్ తేజ్ మా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్‌కు విశేష స్పందన లభించింది. టీజర్‌తోపాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అన్నారు. ఇక సాయిరామ్ శంకర్, యాశ శివకుమార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ లో సునీల్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.