ఆ పార్ట్‌పై పచ్చబొట్టు వేసుకున్న సాయిపల్లవి..సీక్రెట్‌గా ఆ పని ఎప్పుడు చేసిందంటే?

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. ఈమె తన నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకొని మంచి పేరు సంపాదించుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే ఈ చిన్నది లేడీ పవర్ స్టార్

Update: 2024-03-08 05:58 GMT

దిశ, సినిమా : ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. ఈమె తన నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకొని మంచి పేరు సంపాదించుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే ఈ చిన్నది లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించిదంటే, ఈ అమ్మడు గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

ఇక తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అది ఏమిటంటే? చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ టాటూ వేయించుకోవడం కామన్. ఈ క్రమంలోనే సాయిపల్లవి టాటూ వేయించుకున్న న్యూస్ చాలా ట్రెండ్ అవుతోంది. ఏకంగా ఈ ముద్దుగుమ్మ తన చెస్ట్ పై, తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ బొమ్మను వేయించుకుంది.అయితే తాను కాలేజీ చదువుకునే రోజుల్లో తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సీక్రెట్‌గా ఛాతిపై టాటూ వేయించుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తన పేరెంట్స్ మొదట్లో అరిచినా.. తర్వాత లైట్ తీసుకున్నారంట. దీంతో ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి, నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫిదా బ్యూటీ ఈ మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం.


Similar News