Sai Pallavi: నాకు నచ్చకున్నా.. ఆ పని చేశా: సాయి పల్లవి

Sai pallavi says, i feel very happy to cook chicken for a person| టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన అద్భుతమైన నటన, డాన్స్‌, మాటలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

Update: 2022-06-13 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: Sai pallavi says, i feel very happy to cook chicken for a person| టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన అద్భుతమైన నటన, డాన్స్‌, మాటలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే, మరోసారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడానికి 'విరాటపర్వం' సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రేమ గురించి చెబుతూ ఓ సంఘటనను వివరించింది. 'నేను వెజిటేరియన్‌. నాకస్సలు నాన్‌ వెజ్‌ నచ్చదు. కానీ ఒక వ్యక్తి కోసం ఓసారి షాప్‌కు వెళ్లి.. చికెన్‌ తీసుకువచ్చి వండి పెట్టాను. ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించింది. నాలో ఇంత ప్రేమ ఉందా అని నవ్వుకున్నా''అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఆమె చెప్పలేదు. దీంతో సాయిపల్లవి ప్రేమలో పడిందని.. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సంగతులు ప్రేమకు సంబంధించినవే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read: 1992 ఘ‌ట‌న‌కు క‌థ రూప‌మే విరాట‌ప‌ర్వం: వేణు ఊడుగుల‌

Tags:    

Similar News