‘యశ్ 19’ మూవీ‌లో సాయి పల్లవి.. ఈ కాంబినేషన్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

‘కేజీఎఫ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత గ్యాప్ తీసుకున్న హీరో యశ్ అభిమానులంతా అతని నెక్ట్స్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Update: 2023-12-05 07:46 GMT

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత గ్యాప్ తీసుకున్న హీరో యశ్ అభిమానులంతా అతని నెక్ట్స్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ యశ్ మాత్రం తన సినిమా ఏంటనేది చెప్పలేదు. కాకపోతే 19వ సినిమా అదిగో.. ఇదిగో అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికారికంగా ఒక అప్డేట్ అయితే వెలువడింది. శాండల్‌వుడ్ స్టార్ యశ్ నటించబోతున్న ఈ 19వ సినిమా వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8) ఉదయం 9.55 గంటలకు ప్రారంభం కానుంది. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ యాక్టింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే యశ్, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్‌పై వస్తున్న న్యూస్‌లో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ.. ప్రజంట్ ఈ బజ్ వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News