సాయిధరమ్‌ తేజ్‌ లవ్‌ ప్రపోజ్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’.

Update: 2023-04-20 09:19 GMT

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనన్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ప్రెస్‌ మీట్‌లో తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నా తేజ్.

‘యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక నాలో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నది ఒక్కటే జీవితం.. నవ్వుతూ.. నవ్విస్తూ బతకాలని డిసైడ్‌ అయ్యా. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. అందరిలాగే నాకు కొన్ని బ్రేకప్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ‘తిక్క’ సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్‌ షూటింగ్‌ సమయంలో ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్‌ చేద్దాం’ అని డైరెక్ట్‌గా అడిగేశా. కానీ ‘సారీ తేజ్‌.. నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు’ అని చెప్పింది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News