ఔను వాళ్లిద్దరు భార్యాభర్తలే.. అదితి, సిద్ధార్థ్‌కు పెళ్లి!
అందాల తార అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్‌ల డేటింగ్ ఇష్యూ మరోసారి తెరపైకొచ్చింది. 'మహా సముద్రం' సినిమా నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుండగా ఇప్పటికీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు..Latest Telugu News
దిశ, సినిమా : అందాల తార అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్‌ల డేటింగ్ ఇష్యూ మరోసారి తెరపైకొచ్చింది. 'మహా సముద్రం' సినిమా నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుండగా ఇప్పటికీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఈ జోడి.. బ్యూటిఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ అట్రాక్ట్ చేసింది. పింక్ సిల్క్ శారీ, స్టేట్‌మెంట్ జ్యువెలరీలో అదితి, ఇండో-వెస్ట్రన్ లుక్‌లో అందంగా కనిపించిన సిద్ధార్థ్.. ఈవెంట్‌లో ఒకే దగ్గర కూర్చుని ఎంజాయ్ చేశారు.
అలాగే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఒకే కారులో బయలుదేరడం గమనించిన ఫ్యాన్స్.. కచ్చితంగా లవ్‌లో ఉన్నారంటూ చర్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒకే సెలూన్ నుంచి బయటకొచ్చారని, కలిసే షాపింగ్ చేసినట్లు ఫ్రూప్స్ కూడా ఉన్నాయంటూ 'ఔను వాళ్లిద్దరూ కాబోయే భార్య భర్తలు' అని బలంగా వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : పెళ్లికి సిద్ధమైన మరో స్టార్ జోడీ.. ఆ లగ్జరీ బంగ్లాలోనే