మహిళల శరీరంపై చీప్ కామెంట్స్.. వివక్షేనంటున్న రియా
ప్రముఖ మోడల్, నటి రియా భట్టాచార్జే వివక్షపూరితమైన కామెంట్స్ ఎప్పటికీ తనను ప్రభావితం చేయలేవంటోంది.
దిశ, సినిమా: ప్రముఖ మోడల్, నటి రియా భట్టాచార్జే వివక్షపూరితమైన కామెంట్స్ ఎప్పటికీ తనను ప్రభావితం చేయలేవంటోంది. అంతేకాదు భౌతిక రూపం ఆధారంగా పరిశ్రమలో పక్షపాతం చూపించే ధోరణిని వదిలించుకోవాలని.. కంటెంట్, టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలని కోరింది. 'పొట్టిగా లేదా అతి పొడుగ్గా ఉన్న మహిళల ప్రదర్శనలపై వివక్ష చూపుతున్నారు. నటులకు పని కల్పించడానికి ఇవన్నీ ప్రధానం కాదనే నిజాన్ని గుర్తించండి.
గ్లామరస్‌గా ఉన్నవాళ్లు కూడా నెగెటివ్ పాత్రలకు బాగా సరిపోతున్నారు. ఫిజికల్‌గా ఎదుగుదలేని వాళ్లు పాజిటివ్ క్యారెక్టర్లో మన్ననలు పొందుతున్నారు' అని తన అభిప్రాయాలు వెల్లడించింది. అలాగే కాలేజీ అమ్మాయిగా ఉన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌తో పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పిన రియా.. తన కోరిక నేరవేర్చుకునేందుకు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటానని ఓ సమావేశంలో ఫన్నీగా చెప్పుకొచ్చింది.
Read more :
రెండోసారి బ్రేకప్‌కు సిద్ధమైన స్టార్ ప్రేమికులు.. పిల్లల పరిస్థితేంటి?