స్త్రీలను బట్టల్లేకుండా చూడలేను: నైతిక విలువలుండాలంటున్న Ridhi Dogra
టెలివిజన్ నటి రిధి డోగ్రా స్త్రీల వృత్తిపరమైన ఎదుగుదల నైతిక విలువలకు తగ్గట్టుగా ఉండాలంటోంది.
దిశ, సినిమా: టెలివిజన్ నటి రిధి డోగ్రా స్త్రీల వృత్తిపరమైన ఎదుగుదల నైతిక విలువలకు తగ్గట్టుగా ఉండాలంటోంది. ఈ జనవరి 13న విడుదలయ్యే 'లకడ్‌బగ్ఝా' తో బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె.. రీసెంట్ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ మహిళలంతా పనిపట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించింది. 'నేను స్త్రీల అణచివేతను పూర్తిగా వ్యతిరేకిస్తా. పాత్రలు డిమాండ్ చేస్తే తప్ప పర్ఫెక్ట్ బాడీని చూపించాలనే ఆసక్తి లేదు. పొట్టి బట్టలతో ఐటెం సాంగ్స్ లేదా మ్యూజిక్ వీడియోలు చేయలేను.
ఎందుకంటే ఒక అమ్మాయిగా దాన్ని అంగీకరించను. నాతోటి స్త్రీలను బట్టలేకుండా చూడలేను. 20 మిలియన్ల మందికి చూసే అవకాశం ఉన్నా సరే.. ఈ కారణంతో మహిళల అణచివేతను భరించలేను. అయితే అలాంటివి ఎంచుకునే వారిని జడ్జ్ చేయను. కొంతమందికి సెక్సీ దుస్తులు ధరించి డ్యాన్స్ చేయడం ఇష్టం. సెట్స్‌లో ఉన్నప్పుడు వాళ్లను చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతా. కొన్ని ఐటెం సాంగ్స్ చూసి విరక్తిచెందాను' అని తెలిపింది. చివరగా తాను తెలివైన వ్యక్తులతో పనిచేశానని, అర్థవంతమైన సంభాషణలు చేయగలనన్న ఆమె.. స్థిరమైన కలలు లేదా లక్ష్యాలు లేవని, ఒక నటిగా ఫ్లూయిడ్‌గా ఉంటూ కోరుకున్నది చేయగలనే నమ్మకంతో ముందుకెళ్తానని చెప్పింది.
ఇవి కూడా చదవండి : అందంగా ఉందని అరెస్ట్ చేశారు!!