రాఘవేంద్రరావును చంపేస్తానని బెదిరించిన ఆర్జీవీ.. ఎందుకో తెలుసా?

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు.

Update: 2023-04-24 09:32 GMT

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. అతిలోక సుందరి శ్రీదేవి అంటే అమితమైన ఇష్టమున్న ఆయన.. ఆమెకోసం ఓసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును చంపేస్తానని బెదిరించాడట. విషయానికొస్తే.. శ్రీదేవి బతికున్నపుడు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘శ్రీదేవి మా తండ్రి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించింది. ఆమెతో నేను పనిచేశాను. ఒకసారి శ్రీదేవితో రన్నింగ్ షాట్ చిత్రీకరించి, మా తండ్రితో శభాష్ అనిపించుకోవాలని మద్రాసులో రోడ్డుపై ఆమెను పరిగెత్తించా. అప్పుడు శ్రీదేవి చిన్న పిల్ల కాబట్టి ఏం చెప్పినా చేసేది. అలా రోడ్డు మధ్యలో కారు వేగంగా రావడంతో ఆమె కాలుకు దెబ్బ తగిలింది. రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదం తప్పింది’ అని రాఘవేంద్రరావు వివరించారు. వెంటనే పక్కనున్న రామ్ గోపాల్ ‘ఆమేకు ఏదైనా జరిగివుంటే.. నేను మిమ్మల్ని చంపేసేవాడిని’ అంటూ ఫన్నీగా స్పందించాడు. 

Also Read..

మోడల్ కోసం పిజ్జా తయారు చేసిన బాలీవుడ్ స్టార్.. పోస్ట్ వైరల్ 

Tags:    

Similar News