పాలిటిక్స్‌లో సంచలన పరిణామం.. సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి కలిసిన ఆర్జీవీ.. ఎందుకో తెలిస్తే షాక్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి స్పెషల్ గా చెప్పుకోనవసరం లేదు.

Update: 2024-05-18 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి స్పెషల్ గా చెప్పుకోనవసరం లేదు. ఎవరికి భయపడకుండా ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తరచూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తాడు. మరోవైపు పలువురు మహిళా యాక్టర్స్‌తో అతిగా ప్రవర్తించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి కలవడం రాజకీయాల్లో అండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఆర్జీవీకే కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అయ్యారు. అయితే విషయమేంటంటే? ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. కానీ, ఏపీలో వైసీపీకి ఫుల్ సపోర్ట్ చేసే ఆర్జీవీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.


Similar News