దొంగ బాబా బాగోతం.. ఓ పక్క అమ్మాయితో శృంగారం.. మరోపక్క అలాంటి పాటలు చూస్తూ రొమాంటిక్ స్లీప్.. వీడియోలు వైరల్
రామ్ గోపాల్ వర్మ కఠినంగా మాట్లాడినట్లు అనిపించినా నిజాలే చెప్తాడని అంటుంటారు అభిమానులు. ఏ విషయం గురించి అయినా ప్రాక్టికల్ గా మాట్లాడే ఆయన.. తాజాగా దొంగ బాబాలు, సెక్స్ ఎడ్యుకేషన్, పోర్న్, దెయ్యాల గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు.
దిశ, సినిమా: రామ్ గోపాల్ వర్మ కఠినంగా మాట్లాడినట్లు అనిపించినా నిజాలే చెప్తాడని అంటుంటారు అభిమానులు. ఏ విషయం గురించి అయినా ప్రాక్టికల్ గా మాట్లాడే ఆయన.. తాజాగా దొంగ బాబాలు, సెక్స్ ఎడ్యుకేషన్, పోర్న్, దెయ్యాల గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఎంత సక్సెస్ ఫుల్ పీపుల్ అయినా బాబాలు అంటే ఎందుకంత ఆరాధిస్తారో చెప్పుకొచ్చాడు. నిత్యానంద స్వామి విషయాన్ని ఉదాహరణగా తీసుకున్న ఆయన..' బెడ్ మీద రిలాక్స్ అవుతూ, అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఏ మనిషైనా సినిమా పాటలు ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇక్కడ నిత్యానంద స్వామి చేస్తున్నాడన్న విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఈయనకు బాలీవుడ్ నటుడు
వివేక్ ఒబెరాయ్ పరమభక్తుడు. ఈ విషయం గురించి చెప్పినా బాబా గొప్పొడు అనే అన్నాడు. అలాగే ఆరాధించాడు. ఎందుకంటే ఇలాంటి గాడ్ మ్యాన్స్ లేనప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు. తాము ఏం చేసిన బాబా మీద భారాన్ని వేసి రిలాక్స్ అవుతారు. అందుకే ఇలాంటి భక్తిలో మునిగితేలుతారు' అని చెప్పుకొచ్చాడు. ఇక సెక్స్ గురించి చిన్నపిల్లాడికి చెప్పకుండా దాచడం కన్నా ముందు నుంచే చెప్తే ఇందులో ఇంత పెద్ద సమస్యలు ఉంటాయా అని ఆలోచిస్తాడు. స్టంట్ చేసినప్పుడు వాటికి దూరంగా ఉండమని ఎలాగైతే ప్రికాషన్స్ ఇస్తామో అలాగే సెక్స్ విషయంలో కూడా ఇస్తే బాగుంటుందని.. పిల్లలు చెడుకు బానిసలు అవకుండా ఉంటారని అన్నాడు. కాగా పోర్న్ విషయానికి వస్తే బ్యాన్ చేయడం కన్నా కొన్ని నిబంధనలతో అందుబాటులో ఉంచడమే మేలు అన్నాడు RGV. ఎందుకంటే పోర్న్ బ్యాన్ చేయని దేశాల్లోనే రేప్ ఘటనలు లేవని గుర్తుచేసాడు.
మరో విషయం దెయ్యాలంటే అందరికీ భయమే అంటున్నాడు ఆర్జీవీ. 'బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తల్లి నర్గీస్ చనిపోయాక కొద్దిరోజులకు షూటింగ్ కు హాజరయ్యాడు. అయితే కిటికీ దగ్గర ఒకావిడ అటువైపుగా నిల్చోవడంతో తన తల్లి తనకోసం వచ్చిందని అనుకున్నాడు. ఇప్పుడు వచ్చింది దెయ్యం రూపంలో కాబట్టి భయంతో ఆయన శరీరం పూర్తిగా తడిచిపోయింది. నిజంగా అంత ప్రేమ అంటే తల్లి తన కోసం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కానీ అలా కాకుండా భయపడ్డాడు.. అంటే దెయ్యం తల్లి అయినా కూడా భయమే ' అని కామెంట్స్ చేశాడు ఆర్జీవీ.