దమ్ము ఉంటే ఆ వీడియోలు బయటపెట్టు.. మంత్రి రోజా భర్త సంచలన వ్యాఖ్యలు

మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-10-04 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రోజా నటించిన బ్లూ ఫిల్మ్స్‌లో నటించిందని, ఆ వీడియోలు ఇంకా తనవద్ద ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆ వీడియోలు విడుదల చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తాజాగా.. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా భర్త సెల్వమణి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సెల్వమణి మాట్లాడుతూ.. ఇలాంటి రకమైన ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదని, సుమారు పదేళ్ల క్రితమే మంత్రి రోజా గురించి అసభ్యకరమైన ఆరోపణలు చేశారని అన్నారు. రోజా ఒక స్ట్రాంగ్ వాయిస్‌గా మారిన నేపథ్యంలో ఆయన మానసికంగా దెబ్బతీసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదని.. ఏమైనా ఆధారాలు ఉన్నా.. ఏమైనా వీడియోలు ఉన్నా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము లీగల్ గానే ఎదుర్కొంటామని ఆయన చెప్పుకొచ్చారు. సత్యనారాయణమూర్తి ఇలాంటి ఆరోపణలు చేసిన మొదటి వ్యక్తి కాదని గతంలో ఒక మహిళా మంత్రి చనిపోయిన మరో మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు చేసేవారని అన్నారు. రోజాను ఎదుర్కోవడం కష్టం అని భావించే ఇలా మానసికంగా దెబ్బతీసి ఆమెను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలా తయారవుతున్నారని ఆయన అన్నారు.

More News : మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి రోజానే: వంగలపూడి అనిత


Similar News